Jul 21,2023 09:44

బెంగళూరు : గగన్‌యాన్‌కు చెందిన సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎంపిఎస్‌)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో బుధవారం ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో 440 ఎన్‌ థ్రస్ట్‌తో ఐదు లిక్విడ్‌ అపోజి మోటార్‌ (ఎల్‌ఎఎం) ఇంజన్‌లు, 100 ఎన్‌ థ్రస్ట్‌తో నిండిన 16 రియాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ (ఆర్‌సిఎస్‌) థ్రస్టర్‌లు ఉన్నాయి. ఎస్‌ఎంపిఎస్‌ అనేది ఆర్బిటల్‌ మాడ్యుల్‌ అవసరాలను తీరుస్తుంది. రాకెట్‌ ఇంజిన్‌లకు ఆరోహణ దశలో ప్రధాన చోదక శక్తిని అందిస్తుంది. దీంతోనే రాకెట్‌ ఎగరడం, కక్ష్యలోకి ప్రవేశించడం వంటి చర్యలు జరుగుతాయి. బుధవారం ఎస్‌ఎంపిఎస్‌ తన పరీక్షను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు, పూర్తి స్థాయి పనితీరును ప్రదర్శించింది. గగన్‌యాన్‌ ప్రాజెక్టుతో ముగ్గురు వ్యోమగ్యాముల్ని మూడు రోజుల పాటు 400 కిలోమీటర్ల అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి తిరిగి దేశ సముద్ర జలాల్లో దింపడం ద్వారా భూమిపైకి తీసుకుని రావాలని ఇస్రో ప్రణాళిక. ఆగస్టులో గగన్‌యాన్‌ తొలి అబార్ట్‌ పరీక్షను నిర్వహించాలని ఇస్రో భావిస్తుంది.