24.1 ఓవర్ల ఆట పూర్తయ్యక వరుణుడు భారత్, పాక్ మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. వర్షం వల్ల ఆట నిలిపి వేసే సమయానికి కోహ్లి 16 బంతుల్లో 8 పరుగులు, కేఎల్ రాహుల్ 28 బంతులో 17 పరుగులు చేశారు. భారత్ ప్రస్తుతం 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.
- గిల్ క్యాచ్ ఔట్.. భారత్ 123/2
52 బంతుల్లో 58 పరుగులు చేసిన శుభ్‌మాన్‌గిల్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో సల్మాన్ అలీ ఆఘాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ ప్రస్తుతం 123 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
- రోహిత్ ఔట్.. భారత్ 122/1
దాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఫాహీమ్ ఆష్రఫ్‌కు క్యాచ్‌్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ శర్మ 49 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు పూర్తి చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. గిల్ 58 పరుగులు మీద బ్యాటింగ్ చేస్తున్నాడు.
- రోహిత్ 50
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దంచి కోడుతున్నారు. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 115 పరుగులు చేశారు ఈ క్రమంలో రోహిత్ శర్మ 41 బంతుల్లో 50 పరగులు పూర్తి చేసున్నాడు.
గిల్ 50.. రోహిత్ 44.. 13 ఓవర్లలో భారత్ 96/0
సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శుభ్‌మాన్‌గిల్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో గిల్ 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ 41 బంతుల్లో 5ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 44 పరగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 13 ఓవర్లలో 96 పరుగులు చేసింది.
- 10 ఓవర్లు పూర్తి.. భారత్ 61/0
10 ఓవర్లలో భారత్ ఆటగాళ్లు 61 పరుగులు చేశారు. శుభ్‌మాన్‌గిల్ 31 బంతుల్లో 41 పరుగులు చేయగా రోహిత్ శర్మ 30 బంతుల్లో 18 పరగులు చేశారు. మరో వైపు పాకిస్తాన్ బౌలర్లు ఈ ఓపెనింగ్ జోడిని విడగొట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
- 5 ఓవర్లక్లు భారత్ 37/0
5 ఓవర్లు ముగిసే సరికి భారత్ 37 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం రోహిత్ 17 బంతుల్లో 10 పరగులు చేయగా శుభ్‌మాన్‌గిల్ 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
- టాస్ గెలిచిన పాకిస్తాన్.. భారత్ తొలుత బ్యాటింగ్
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో రాహుల్ షమీ స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
తుది జట్లు
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, ఫాహీమ్ ఆష్రప్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, , షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్










