Sep 02,2023 21:54
  • షాహిన్‌ అఫ్రిదికి నాలుగు వికెట్లు
  • వరుణుడు అడ్డంకి

కాండీ: భారత్‌-పాకిస్తాన్‌ ఆసియా కప్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచాడు. భారతజట్టు ఇన్నింగ్స్‌ ఆరంభించినప్పుడు కొంతసేపు అడ్డంకిగా నిలిచిన వరుణుడు, టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మరోసారి ఆటంకపరిచాడు. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు పాకిస్తాన్‌ పేసర్ల ధాటికి 266పరుగులకే ఆలౌటైంది. తొలుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(11), శుభ్‌మన్‌ గిల్‌(10), విరాట్‌ కోహ్లీ(4), శ్రేయస్‌ అయ్యర్‌(14) నిరాశపరిచారు. దీంతో టీమిండియా 66పరుగులకే టాపార్డర్‌ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇషన్‌ కిషాన్‌, హార్దిక్‌ పాండ్యా చేపట్టారు. షాదాబ్‌ ఖాన్‌ వేసిన 29వ ఓవర్‌ రెండో బంతికి సింగిల్‌ తీయడంతో ఇషాన్‌ కిషన్‌ 54బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుచేశాడు. ఆ తర్వాత సెంచరీ దిశగా వెళ్తున్న ఇషాన్‌ను పాక్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ 38వ ఓవర్‌ మూడో బంతిని భారీ షాట్‌ కొట్టడంతో బాబర్‌ ఆజామ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో టీమిండియా 204 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత స్కోర్‌ పెంచే బాధ్యతను హార్దిక్‌ పాండ్యా అందుకున్నాడు. షాహీన్‌ అఫ్రిది వేసిన 44వ ఓవర్‌ తొలి బంతికి అఘా సల్మాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పాండ్యా పెవిలియన్‌ దారి పట్టడా.. అదే ఓవర్‌ చివరి బంతికి రవీంద్ర జడేజా కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే శార్దూల్‌ ఠాకూర్‌ ఇలా ఒక్కొక్కరు పెవీలియన్‌ బాట పట్టారు. దీంతో టీమిండియా కనీసం 250పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది.
10కి పది పేసర్లకే..
పాకిస్తాన్‌ పేసర్లు భారత్‌పై రాణించారు. భారత్‌తో జరిగిన పోరులో 10కి పది వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. నాణ్యమైన పేస్‌ను ఎదుర్కోవడం టీమిండియాకు కష్టమే అని మ్యాచ్‌కు ముందు నుంచే మాజీలు పేర్కొన్నట్లే జరిగింది. వర్షం అంతరాయం మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ పేసర్లు అదరగొట్టారు. ప్రపంచంలో తమది అత్యుత్తమ పేస్‌ త్రయం ఎలా అయిందో పల్లెకెలెలో చూపించారు. తొలి స్పెల్‌లో నిప్పులు చెరిగిన షాహీన్‌ షా అఫ్రిది.. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీని తొలుత వెనక్కి పంపాడు. ఆ తర్వాత జడేజా, పాండ్యాలను ఒకే ఓవర్‌లో ఔట్‌ చేసి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. షాహిన్‌ అఫ్రిది(4/35), నసీమ్‌ షా(3/36), రవూఫ్‌(3/56) పది వికెట్లు కూల్చారు. స్టార్‌ స్పిన్నర్‌ షాదాబ్‌, నవాజ్‌ నిరాశపరిచారు.
స్కోర్‌బోర్డు..
రోహిత్‌ శర్మ (బి)షాహిన్‌ అఫ్రిది 11, శుభ్‌మన్‌ (బి) రవూఫ్‌ 10, కోహ్లి (బి)షాహిన్‌ అఫ్రిది 4, శ్రేయస్‌ అయ్యర్‌ (సి)ఫకర్‌ (బి)రవూఫ్‌ 14, ఇషాన్‌ (సి)బాబర్‌ (బి)రవూఫ్‌ 82, హార్దిక్‌ (సి)అఘా సల్మాన్‌ (బి)షాహిన్‌ షా 87, జడేజా (సి)రిజ్వాన్‌ (బి)షాహిన్‌ షా 14, శార్దూల్‌ (సి)షాదాబ్‌ (బి)నసీమ్‌ షా 3, కుల్దీప్‌ (సి)రిజ్వాన్‌ (బి)నసీమ్‌ షా 4, బుమ్రా (సి)అఘా సల్మాన్‌ (బి)నసీమ్‌ షా 16, సిరాజ్‌ (నాటౌట్‌) 1, అదనం 20. (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 266పరుగులు.
వికెట్ల పతనం: 1/15, 2/27, 3/48, 4/66, 5/204, 6/230, 7/242, 8/242, 9/261, 10/266
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 10-2-35-4, నసీమ్‌ 8.5-0-36-3, రవూఫ్‌ 9-0-58-3, షాదాబ్‌ 9-0-57-0, నవాజ్‌ 8-0-55-0, అఘా సల్మాన్‌ 4-0-21-0

  • నిలకడగా హార్దిక్‌, ఇషాన్‌.. టీమిండియా 187/4

ఇషాన్‌ కిషన్‌తో కలిసి పాండ్యా నిలకడగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నాడు. 62 బంతుల్లో హార్దిక్‌ పాండ్యా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరో వైపు ఇషాన్‌ 77 బంతుల్లో 75 పరుగులు మీద బ్యాంటింగ్‌ చేస్తున్నాడు. 36 పూర్తయ్యే సరికి టీమిండియా 187/4 పరుగులు చేసింది.

 

  • ఇషాన్‌ 50..  టీమిండియా 147/4

48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టును ఇషాన్‌ కిషాన్‌ ఆదుకున్నాడు. వికెట్లు పడుతున్న సమయంలో 54 బంతులాడి 50 పరుగులు చేసి అద్భుతమైన అర్థసెంచరినీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 29 ఓవర్లు ముగిసే సరికి 147 పరుగులు చేసింది. ఇషాన్‌ 55, పాండ్యా 37 పరుగులు చేశారు.

 

  • 25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 127/4

25 ఓవర్లలో టీమిండియా 127 పరుగులు చేసింది. ఇషాన్‌ హార్దిక్‌ పాండ్యా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తు స్కోరు బోర్డును పెంచుతున్నారు. ఇషాన్‌(43), హార్దిక్‌ పాండ్యా(30). వీరిద్దరి మెరుగైన ఇన్నింగ్స్‌ కారణంగా 25 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 127 పరుగులు చేసింది.

  • 20 ఓవర్లలో భారత్‌ 102/4

20 ఓవర్లలో భారత్‌ 102 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా(16) ఇషాన్‌ కిషాన్‌ (33) పరుగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • 17 ఓవర్లు పూర్తి.. భారత్‌89/4

17 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్‌ పాండ్యా(7) ఇషాన్‌ కిషాన్‌ (28) పరుగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  •  శుభ్‌మాన్‌ గిల్‌ ఔట్‌.. టీమిండియా 66/4

14 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. చివరిగా నెమ్మదిగా ఆడుతున్న శుభ్‌మాన్‌ గిల్‌.. హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. క్రీజులోకి హార్దిక్‌ పాండ్యా వచ్చాడు. ఇషాన్‌ కిషాన్‌ 15 బంతుల్లో 13 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • మరోసారి వర్షం అంతరాయం

11.2: వర్షం అంతరాయం కలిగించడంతో మళ్లీ ఆటను నిలిపివేశారు. వర్షం వల్ల రెండోసారి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ స్కోరు 11.2 ఓవర్లలో 3 వికెట్లకు 51 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (6 బ్యాటింగ్), ఇషాన్ కిషన్ (2 బ్యాటింగ్) ఉన్నారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2 వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్ 1 వికెట్ పడగొట్టాడు. 

  • శ్రేయస్‌ అయ్యర్‌ ఔట్‌.. టీమిండియా 51/3

టీమిండియా ఆదిలోనే కష్టల్లో పడింది. శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో ఫఖర్‌ జమాన్‌కు క్యాచ్‌ ఇచ్చి శ్రేయస్‌ ఔటయ్యాడు. శేయస్‌ 9 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులోకి ఇషాన్‌ కిషాన్‌ వచ్చాడు. శుభ్‌మాన్‌ గిల్‌ 24 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు.

  • షాక్‌ కోహ్లీ ఔట్‌

టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. విరాట్‌ కోహ్లి ఆఫ్రిది బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు.

 

  • రోహిత్‌ ఔట్‌

వర్షం అంతరాయం అనంతరం ఆట మొదలుపెట్టిన టీమిండియాకు షాక్‌ తగిలింది. షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో రోహిత్‌ 11 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్‌ కోహ్లి, గిల్‌(1) క్రీజులో ఉన్నారు.

  • వర్షం అంతరాయం.. 4.2 ఓవర్లలో ఇండియా 15/0

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ 18 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేయగా శుబ్‌మన్ గిల్ 8 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు

  • 3 ఓవర్లకు 14 పరుగులు

3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 14 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 16 బంతుల్లో 11 పరుగులు చేశాడు. 2 బంతులు ఆడిన శుభ్‌మాన్‌ గిల్‌ ఇంకా ఖాతా తెరవలేదు.

  • తొలి ఓవర్‌లో 6 పరుగులు

ఆసియా కప్‌ 2023 టోర్నీలో భాగంగా టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, శుభ్‌మాన్‌ గిల్‌ దిగారు. షాహిన్‌ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ శర్మ అద్భుతమైన ఫోర్‌ కొట్టి.. 5 బంతిని సింగ్‌ తీశాడు. ఆఖరి బంతిని శుభ్‌మాన్‌గిల్‌ డిఫెన్‌ ఆడాడు.

  • టాస్‌ గెలిచిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్‌

ఆసియా కప్‌ 2023 టోర్నీలో భాగంగా నేడు టీమిండియా, పాకిస్తాన్‌తో తలబడుతోంది. శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె స్టేడియంలో భారత్‌- పాకిస్తాన్‌ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

తుది జట్లు
పాకిస్తాన్‌: 
ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌ ఆజం(కెప్టెన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌(వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ అలీ ఆఘా, ఇఫ్తికర్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, షాహిన్‌ అఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌.
భారత్‌ : రోహిత్‌ శర్మ(సి), శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌