
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పాక్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీఖ్ (9), ఇమామ్ ఉల్ హక్ (12)లను మార్కో జాన్‌సెన్ తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ తో కలిసి మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. మహమ్మద్ రిజ్వాన్(31)ను గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇఫ్తికార్ అహ్మద్ (21) వికెట్‌ను పాక్ చేజార్చుకుంది. సౌతాఫ్రికా స్పిన్నర్ షంషి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నించిన ఇఫ్తికార్ లాంగాన్‌లో హెన్రిచ్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (50) షంషి బౌలింగ్‌లో కీపర్ డి కాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులో సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్ ఉన్నారు.