Sep 27,2023 21:43
  • భారీ భద్రత నడుమ హోటల్‌కు తరలింపు

హైదరాబాద్‌: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్‌ జట్టు భారత్‌కు చేరుకుంది. బుధవారం లాహోర్‌ నుంచి దుబారు మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరకున్న పాకిస్తాన్‌ ఆటగాళ్లను భారత భద్రత నడుమ హోటల్‌కు తరలించారు. ఇందులో 18మంది ఆటగాళ్లు, 13మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్‌ బృందం ఉంది. వీరంతా లాహోర్‌ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు విచ్చేశారు. వీరికి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా వారికి కేటాయించిన హోటల్‌ కు తరలించారు. రేపు(29న) హైదరాబాదులోని ఉప్పల్‌ స్టేడియంలో పాకిస్తాన్‌ జట్టు న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతించని సంగతి తెలిసిందే.