Oct 06,2023 22:26

హైదరాబాద్‌: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 81 పరుగుల తేడాతో పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. పాకిస్తాన్‌ జట్టు 49 ఓవర్లలో 286పరుగులకు ఆలౌట్‌ కాగా.. నెదర్లాండ్స్‌ జట్టు 41ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. రవూఫ్‌కు మూడు, హసన్‌ అలీకి రెండు, షాహిన్‌ షా, మహ్మద్‌, ఇప్తికార్‌, షాదాబ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అంతకుముందు టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఫకర్‌ జమాన్‌(12), ఇమామ్‌(15)కి తోడు కెప్టెన్‌ బాబర్‌(5) నిరాశపరిచారు. దీంతో పాక్‌ జట్టు 38పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌(68), షౌద్‌ షకీల్‌(68) కలిసి 4 వికెట్‌కు 120పరుగులు జతచేశారు. ఆ తర్వాత నవాజ్‌(38), షాదాబ్‌(32) ఫర్వాలేదనిపించడంతో పాకిస్తాన్‌ గౌరవప్రద స్కోర్‌ చేసింది. నెదర్లాండ్స్‌ బౌలర్లు లీడేకు నాలుగు, అక్మన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
బంగ్లాదేశ్‌ × ఆఫ్ఘనిస్తాన్‌
(వేదిక: ధర్మశాల; ఉ.10.గం||లకు)
దక్షిణాఫ్రికా × శ్రీలంక
(వేదిక: ఢిల్లీ; మ.2.00గం||లకు)