Sep 19,2023 18:05

హైదరాబాద్‌ : పాక్‌-న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మ్యాచ్‌కు ముందు రోజు (సెప్టెంబర్‌ 28) నగరంలో గణేశ్‌ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్‌ను వాయిదా వేయాలని వారు హెచ్‌సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్‌ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్‌ మార్పు కుదరదని హెచ్‌సీఏకు తేల్చి చెప్పింది. దీంతో పాక్‌-న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వనుంది.