Sep 02,2023 17:05

బలోచిస్తాన్‌ : గడచిన 24 గంటల్లో బలూచిస్తాన్‌లో వేర్వేరు ఆపరేషన్లలో పాకిస్తాన్‌ ఉగ్రవాద నిరోధక విభాగం (సిటిడి) ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు పాకిస్తాన్‌కు చెందిన ఎఆర్‌వై న్యూస్‌ అనే మీడియా సంస్థ శనివారం నివేదించింది. సిటిడికి అందిన సమాచారం మేరకు వాషుక్‌ జిల్లాలోని బసిమా పట్టణంలోని తహసీల్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని ఓ ఇంటిపై భద్రతా బలగాలు శుక్రవారం దాడి దాడి చేశాయి. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో ముగ్గురు తప్పించుకున్నారని పాకిస్తాన్‌ మీడియా సంస్థ అవుట్‌లెట్‌ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం సిటిడి స్వాధీనం చేసుకుందని ఎఆర్‌వై న్యూస్‌ సంస్థ తెలిపింది.
క్వెట్టాలో శుక్రవారం జరిగిన మరో ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒక బిడ్డను ముగ్గురు ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారని అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు స్థావరానికి చేరుకుని.. చిన్నారిని సురక్షితంగా కాపాడారని, ఈ ఆపరేషన్‌లో ఆ ముగ్గురి ఉగ్రవాదుల్ని చంపినట్లు సిటిడి ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. ఉగ్రవాదుల రహస్య స్థావరం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని సిటిడి ప్రతినిధి అవుట్‌లెట్‌కి తెలిపారు.