ప్రజాశక్తి - తిరుపతి టౌన్ : తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయల్దేరి వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని యార్డు వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైల్వే కార్మికులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులను చేపట్టారు. రైలు సెంట్రింగ్ చేస్తుండగా బోగీలు పట్టాలు తప్పాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ నంబర్. 12763 పద్మావతి ఎక్స్ ప్రెస్ సాయంత్రం 4.55కు బయల్దేరాల్సి ఉండగా రాత్రి 7.45కు బయలుదేరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే రాయలసీమ ఎక్స్ప్‌ఎస్ సాయంత్రం 5.30కు బయల్దేరాల్సి ఉండగా రాత్రి 8 గంటలకు బయల్దేరింది. ప్రయాణికులు కొన్ని గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది.










