ప్రజాశక్తి-నెల్లూరు : నర్సాపూర్-ధర్మవరం రైలుకు ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కావలి-బిట్రగుంట మధ్య ఎగువమార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్‌పై అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ అదేమార్గంలో వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ పట్టా ముక్కను రైలు ఢకొీట్టగానే అది దూరంగా పడిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆర్‌పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.










