టంగుటూరు (ప్రకాశం) : రైలు పట్టాలపై తలపెట్టి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి రైల్వే పోలీసులు చేరుకున్నారు. మృతుడు కొండేపి బీసి కాలనీ కి చెందిన కొనికి.శ్రీకాంత్ (29) గా గుర్తించారు. శ్రీకాంత్ కు ముగ్గురు ఆడపిల్లలున్నారు. అప్పుల బాధ తాళలేక శ్రీకాంత్ ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










