షాపూర్‌నగర్: హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధిలోని కేటీఆర్ కాలనీలో విషాదం నెలకొంది. సెల్‌ఫోన్ పోయిందని ఓ యువకుడు మనస్తాపంతో.. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని నీతీష్‌రాజ్ (26)గా గుర్తించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










