పేట్‌బషీరాబాద్ (జగద్గిరిగుట్ట) : మర్మాంగాన్ని కోసుకొని వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీసుల కథనం మేరకు ... ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి కుమార్తె, కుమారుడు దీక్షిత్ రెడ్డి ఉన్నారు. దీక్షిత్‌రెడ్డి (21) సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీక్షిత్‌రెడ్డి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గతంలో నిద్రమాత్రలు మింగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అప్పటి నుండి తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. మందులు తీసుకుంటున్నానంటూ ... దీక్షిత్ రెడ్డి మనోవేదనకు గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో ... కుటుంబ సభ్యులు బయటకెళ్లి ఆదివారం సాయంత్రం 5 గంటలకు తిరిగి ఇంటికి రాగా.. ఇంట్లో ఉన్న దీక్షిత్‌రెడ్డి ఎంతకీ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో పడిఉన్నాడు. వెంటనే 108కు ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి చూసేసరికి దీక్షిత్ రెడ్డి మర్మాంగం కోసుకొని మఅతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










