ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) :చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ డాక్టర్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం యనమలమంద పంచాయతీ శ్రీనివాసపురం గ్రామానికి చెందిన బోడిరెడ్డి మధురెడ్డి (25) బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో సైకియాట్రిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని తన రూమ్‌లో ఉరివేసికుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీనివాసపురానికి శుక్రవారం ఉదయం పోలీసులు తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.










