ఒడిశా : ఒడిశా బాలేశ్వర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగలింగ్‌లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్ లైన్‌లోకి రైలు ప్రవేశించింది. లోకోపైలట్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లూప్‌లైన్ పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన లోకోపైలట్.. వెంటనే బ్రేకులు వేశాడు. దీనిపై సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిగలింగ్‌లో తలెత్తిన లోపాన్ని సరిదిద్ది.. రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో భద్రక్ నుంచి బాలేశ్వర్ లైనులో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు చేస్తున్న లైనులోకి అలానే వెళ్లుంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.










