- ముంజల్ నివాసాల్లో ఇడి దాడులు
- పడిపోయిన షేర్ల ధరలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మానీలాండరింగ్ కేసును నమోదు చేసిందని సిఎన్‌బిసి ఓ కథనంలో వెల్లడించింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సోమవారం ముంజల్‌కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఇడి సోదాలు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఫిర్యాదు మేరకు ఇడి అధికారులు దిల్లీ సహా గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.










