Jun 30,2023 12:55

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మైట్రో ప్రయాణీకులతో సరదాగా ఆయన ముచ్చటించారు. శుక్రవారం 'ఢిల్లీ విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో' పాల్గొనేందుకు ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌ మెట్రో స్టేషన్‌ నుండి విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్‌ వరకు రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రో రైల్లోని ప్రయాణీకులతో మాట్లాడుతున్న మోడీ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
కాగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం మే 1వ తేదీ 1922వ సంత్సరంలో స్థాపించబడింది. గడచిన వందేళ్లలో ఎంతోమంది విద్యార్థులకు అపారమైన విజ్ఞానాన్ని అందించింది. ప్రస్తుతం 86 విభాగాలు, 90 కళాశాలలు, 6 లక్షలకు పైగా విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు.

modi