ఢిల్లీ : ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. గద్దర్ భార్య గుమ్మడి విమలకు ఈ రోజు ఆయన లేఖ రాశారు. గద్దర్ మతి గురించి తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. మీరు తీవ్ర దు:ఖంలో ఉన్న ఈ సమయంలో హదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. బడుగు,బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను గద్దర్ పాటలు ప్రతిబింబిస్తాయని మోడీ గుర్తు చేశారు.
ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందారు. ఈ ఏడాది జూలై 20వ తేదీన గుండెపోటుతో గద్దర్ హైద్రాబాద్ బేగంపేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు. గద్దర్‌కు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే గద్దర్‌కు ఊపిరితిత్తులు, యూరినరీ ఇన్ ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 7వ తేదీన గద్దర్ అంత్యక్రియలను బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారంగా నిర్వహించిన విషయం తెలిసిందే.