Mar 02,2023 15:26

ప్రజాశక్తి-పాడేరు : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ గురువారం పాడేరులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పాడేరులో ఉపాధ్యాయ వర్గాలను, నిరుద్యోగ పట్టభద్ర ఓటర్లను కలిసి తనకు ఓట్లు వేసి గెలిపించవలసినదిగా అభ్యర్థించారు. అంతకుముందు ప్రెస్‌ మీట్‌ నిర్వహించి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న అవశ్యకతను వివరిస్తూ ఏజెన్సీలోని పట్టభద్రుల ఓటర్లందరినీ తనకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. పాడేరులో ప్రచారం ముగించుకుని అనంతరం అరకు లోయలో ప్రచారం కోసం బయలుదేరి వెళ్లారు.