ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : కైగల్ బ్రిడ్జి వద్ద కారు బోల్తాపడటంతో ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం బైరెడ్డిపల్లిలో జరిగింది. బైరెడ్డిపల్లి టు కుప్పం జాతీయ రహదారిలోని కైగల్ బ్రిడ్జి వద్ద కారు బోల్తాపడి ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వాహన సిబ్బంది ఒక ప్రకటనలో తెలియపరిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










