Aug 07,2023 13:28

ప్రజాశక్తి-తుగ్గలి (కర్నూలు) : మండల కేంద్రమైన తుగ్గలికి చెందిన మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. వైఎస్‌ఆర్సిపి నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, శ్రీనివాస్‌ రెడ్డి భార్య రంగమ్మ ,రంగమ్మ చెల్లెలు అరుణమ్మ లు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. హైదరాబాదులో జరిగిన ఒక ఫంక్షన్‌ లో పాల్గని తిరిగి స్వగ్రామమైన తుగ్గలికి వస్తుండగా మూడు కిలోమీటర్ల దూరంలో రాతన రైల్వే రోడ్డు వద్ద బ్రిడ్జికి ప్రమాదవశాత్తు కారు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ రెడ్డి, రంగమ్మ ,విజయలక్ష్మి, అరుణమ్మ తదితరులు గాయపడ్డారు. కర్నూలులోని గౌరీ గోపాల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పత్తికొండ శాసన సభ్యులు శ్రీదేవి, మాజీ శాసన సభ్యులు ఎస్‌ వి మోహన్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌ రెడ్డి, రాతన మోహన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, పల్లె ప్రతాప్‌ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి, లలిత రామచంద్ర, వెంకటపతి, తదితరులు గాయపడినవారిని పరామర్శించారు.