Nov 16,2023 08:08

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ నందు కలెక్టర్ ఆర్ డి ఓ ఆదేశాల మేరకు బిఎల్ఓ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ నాగభూషణం మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఓటర్ కార్డు నమోదు చేయాలని తెలిపారు.  కొత్తగా ఇల్లు కట్టించుకున్న లబ్ధిదారులకు బిఎల్ఓ సర్వే ద్వారా ఇంటి నెంబర్లు ఇప్పించాలని అన్నారు.చనిపోయిన లబ్ధిదారుల పేర్లను ఓటర్ లిస్టు నుండి తొలగించాలని తెలియజేశారు. మరోసారి బిఎల్ఓ సర్వే చేసి తద్వారా ఓటర్ లిస్టులో ఇంటి నెంబర్ లో ఉన్న తప్పులను ఫారం 8 ద్వారా సరిచేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు  సూపర్వైజర్లు తలారులు పాల్గొన్నారు.