కనగానపల్లి (అనంతపురం) : టైర్ పంక్చర్ అవ్వడంతో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ఘటన శనివారం కనగానపల్లి మండలంలో జరిగింది. కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి జాతీయ రహదారి 44 జాతీయరహదారిపై కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్నవారంతా అప్రమత్తమయ్యి కారు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.










