Jun 12,2023 20:44

న్యూఢిల్లీ : టెక్‌ ఆధారిత సేవల కంపెనీల్లో ఉద్యోగ భద్రత గాల్లో దీపంలాగా మారింది. మందగమనం సాకులు చూపి ఐటి కంపెనీలు వరుస కట్టి ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా తనఖా సంబంధిత సేవలను అందించే ఆన్‌లైన్‌ వేదిక బెటర్‌.కాం 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తన రియల్‌ ఎస్టేట్‌ విభాగాన్ని మూసి వేయడంతో అందులోని మొత్తం మంది ఉద్యోగులను తొలిగించినట్లు బెటర్‌.కాం సిఇఒ విశాల్‌ గార్గ్‌ వెల్లడించారు. మార్ట్‌గేజ్‌ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత్తి వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కాగా.. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఎలాంటి పరిహార ప్యాకేజీ ఇవ్వలేదని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.