
మంచి నీటికి నెలవు
మా ఊరి చెరువు
నీట చూడగ నాచు
పచ్చగా కనిపించు
చల్లని గాలులు వీచు
మదినెంతొ పులకించు
పిల్ల గాలుల తోడుగ
అలలతో అలరించు
చెరువు నిండుగ పూలు
ముచ్చటగొలుపు పూలు
అందాలు ఒలికించు
వాసనలు చిలికించు
ఉదయాన వికసించు
రవి కిరణం సోకగ
ఎరుపు రంగున పూలు
ఎర్రతామర పువ్వులు
రేరాజు వెన్నెలల
విరబూయో కలువలు
పలు జాతుల పూలు
పసిడి వెన్నెల వెలుగులు
నీటను ఈదే చేపలు,
ఎగిరి గంతులతో ఆటలు,
కిందకు మీదకుదుముకుతు,
జల పుష్పాలు కనిపించు,
నదుల నీరు తరిగిన,
మా చెరువే తరగదు,
వేసవిలో జనమంత,
పొందెదరు సుఖమంత,
పొరుగు పల్లెల జలము,
కష్టమైన తరుణము
మా చెరువే ఆధారం
కనికరము వారి చూడ,
పశువులను కడుగబోము,
చెత్తలే వేయబోము,
పెద్దల సుద్దుల వింటు,
సౌఖ్యముగా ఉంటాముబీ
సైబీరియా అతిధులు
వలస వచ్చే పక్షులు
పలు పక్షులా కూతలు
మా వీనులకు విందులు
జలము చేయును మేలు,
నీరు తాగితె చాలు,
ఆరోగ్యముగ ఉంటు,
భాగ్యాలు పొందెదము
- బెహరా ఉమామహేశ్వరరావు
92900 61336.