హాయ్ ఫ్రెండ్స్,
నా పేరు కౌశిక్. మా స్కూలు ప్రధానోపాధ్యాయులు బాల సుబ్రమణ్యం సార్ అంటే మాకు చాలా ఇష్టం. ఆయన అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్తారు. ఆకట్టుకునేలా ఆయన మాటలు ఉంటాయి. ఆయనంటే నాకే కాదు, నా స్నేహితులందరికీ ఇష్టం. గేయాలు రాసి మా చేత పాడిస్తారు. కథలు రాసి మాకు చెబుతారు. సందర్భాను సారంగా బొమ్మలు గీయించి మాలో చైతన్యం కలిగిస్తారు. ప్రతి సంవత్సరం మమ్మల్ని విహార యాత్రకు తీసుకుని వెళుతుంటారు. అక్కడ వింతలు, విశేషాలు వివరిస్తారు. అట్ట ముక్కలతో బొమ్మలు తయారు చేయిస్తారు. ప్రముఖుల జీవిత చరిత్రలు చెపుతుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం. మా సార్ మిమిక్రీ కూడా చేస్తారు. ముఖ్యమైన రోజుల్లో అనేక కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్గొనేలా చేస్తారు. అందుకని మా మాష్టారంటే మాకెంతో ఇష్టం.
- కౌశిక్, 4వ తరగతి,
ఎంపీ ప్రాథమిక పాఠశాల, పెన్నలపాడు, తొట్టంబేడు మండలం, తిరుపతి జిల్లా.










