
- టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్‌లో 14 భారత్‌లోనే
- ప్రపంచంలో టాప్ 5 కాలుష్య దేశాల్లోనూ చోటు
న్యూఢిల్లీ : భారత్‌లో రోజురోజుకూ కాలుష్యం తీవ్రరూపం దాలుస్తోంది. 2022 ఏడాదికి గానూ ప్రపంచంలో 20 అత్యంత కాలుష్య నగరాలను ఎంపిక చేయగా, అందులో 14 భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచంలో ఐదు అత్యంత కాలుష్య దేశాల్లో భారత ఒకటిగా నిలిచింది.
చాద్, ఇరాక్, పాకిస్థాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్‌లతో కలిసి భారత్ అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ గత ఏడాది కంటే మూడు స్థానాలు మెరుగుపడినా, ప్రపంచంలో ఐదు అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో 20 అత్యంత కాలుష్య నగరాలు.
1. లాహోర్ (పాకిస్థాన్)
2. హోటన్ (చైనా)
3. భివాడి (భారత్)
4. ఢిల్లీ (భారత్)
5. పెషావర్ (పాకిస్థాన్)
6. దర్భంగా (భారత్)
7. అసోపూర్ (భారత్)
8. ఎన్ డజమెనా (చాద్)
9. న్యూఢిల్లీ (భారత్)
10. పాట్నా (భారత్)
11. ఘజియాబాద్ (భారత్)
12. ధరుహెరా (భారత్)
13. బాగ్ద్దాద్ (ఇరాక్)
14. చాప్రా (భారత్)
15. ముజఫర్‌నగర్ (భారత్)
16. ఫైసలాబాద్ (భారత్)
17. గ్రేటర్ నోయిడా (భారత్)
18. బహుదూర్‌గఢ్ (భారత్)
19. ఫరిదాబాద్ (భారత్)
20. ముజఫర్‌పూర్ (భారత్)