Nov 05,2023 15:14

న్యూఢిల్లీ :   ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాల్లో మరోసారి ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఢిల్లీలో ఆదివారం ఉదయం వాయు నాణ్యతా ప్రమాణం ( ఎక్యూఐ) 438గా నమోదైన సంగతి తెలిసిందే. స్విస్‌ ఎయిర్‌ మానిటర్‌ ఐక్యూఎఐఆర్‌ ఆదివారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కోల్‌కతా (ఎక్యూఐ 206)తో మూడోస్థానంలో నిలవగా, ముంబయి (ఎక్యూఐ 162)తో ఆరోస్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌ లోని లాహోర్‌ (ఎక్యూఐ 371)తో రెండవ స్థానంలో, కరాచీ (ఎక్యూఐ 162)తో ఐదవ స్థానాల్లో నిలవగా, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా (ఎక్యూఐ 189)తో నాల్గవ స్థానంలో నిలిచింది.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, గాలి లేకపోవడం, పంటవ్యర్థాల దగ్థంతో వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని సుమారు 20 మిలియన్ల మంది కళ్ల మంటలు, గొంతులో దురదతో పాటు శ్వాస కోస సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్యూఐ 550కి చేరుతోందని అన్నారు.