Sep 05,2023 16:50

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించాలని టిటిడి సభ్యులు మేకా శేషుబాబు.. టిటిడి చైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో మంగళవారం టిటిడి కొత్త బోర్డు సభ్యుల తొలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం శేషుబాబు చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. పాలకొల్లులో గత 30 సంవత్సరాలుగా గోవిందమాల భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణం గోదావరి జిల్లాల స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనికి ఆర్థిక సహాయం చేయాలని కూడా కోరారు. దీనికి చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పాలకొల్లులో శ్రీవారి ఉత్సవ విగ్రహాలతో కల్యాణం ఎపుడు జరగలేదని శేషుబాబు చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు.