టెక్సాస్ : ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ కూడా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ఇటీవల ఒరాకిల్‌కి చెందిన సెర్నర్ సంస్థ నుండి 3,000కు పైగా ఉద్యోగులను తొలగించింది. ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌లో ప్రస్తుత, మాజీ ఉద్యోగుల ప్రమోషన్‌లను నిలపుదల చేసి, ఉద్యోగులపై వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్‌లో సెర్నర్ సంస్థను ఒరాకిల్ 28.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2023కి సంబంధించి కంపెనీలో ఉద్యోగులకు వేతన పెంపుదల జారీ చేయలేదని, ప్రమోషన్‌లను మంజూరు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. కార్మికులు ఈ ఏడాదికి ఎలాంటి వేతన పెంపుదలలను ఆశించకూడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. ఈ తొలగింపులు ఒరాకిల్‌కి చెందిన మార్కెటింగ్, ఇంజినీరింగ్, అకౌంటింగ్, లీగల్, ఉత్పత్తులకు సంబంధించిన ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుందని వెల్లడించాయి.










