దేహమంతా సందేహాన్ని నింపుకుని
చేతులు చాచి వేచి ఉన్నప్పుడు..
చేరిన ఋతువులన్నీ
శిశిరమై జారిపోయాయి
ఏకాంత శిఖరమై మిగిలాను !
శ్వాసలో విశ్వాసాన్ని పొదిగి
ఆశను ఆవాహనం చేసుకోగా..
విశ్వమే వచ్చి చెంత చేరింది
ఆహ్వానించకనే ఆలింగనం చేసుకుంది
ఉత్తుంగ తరంగాల సంద్రమై నిలిచాను
మానవ జీవన సౌందర్యమై వెలిశాను!
- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ,
94408 36931










