
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల తయారీదారు ఒప్పో భారత మార్కెట్లోకి తన కొత్త మోడల్ ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌ను విడుదల చేసింది. దీని ధరను 94,999గా నిర్ణయించింది. దీనిని ట్రిపుల్ కెమెరాతో ఆవిష్కరించింది. 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సర్ కెమెరా, 48 మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్, 32 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ కెమెరా ఉంటాయి. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చింది. అక్టోబర్ 22 నుంచి ఆన్‌లైన్‌లో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 4300 ఎంఎహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో బుక్ చేసుకున్న వారికి రూ.12 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది.