న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మహిళ ఉన్నతాధికారుల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది. ఈ పరిశ్రమలో 42 మంది మహిళ ఫండ్ మేనేజర్లు మాత్రమే ఉన్నారని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఇండియా తెలిపింది. గతేడాది 32 మంది ప్రాథమిక, ద్వితీయ శ్రేణీ ఫండ్ మేనేజర్లు ఉన్నారని పేర్కొంది. దీంతో పోల్చితే ఈ ఏడాది సంఖ్య పెరిగినప్పటికీ ఇంకా తక్కువగానే ఉన్నారు. ఈ పరిశ్రమలో మొత్తం ఫండ్ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి పెరిగిందని ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండిస్టీ -2023లో మార్నింగ్ స్టార్ తెలిపింది. 24 ఫండ్ కంపెనీల్లో కేవలం 42 మంది మాత్రమే మహిళ ఫండ్ మేనేజర్లు ఉన్నారని తెలిపింది. ఐదు సంస్థల్లో ముగ్గురు ఆపైన మహిళలు ఉన్నారు. ఆరింటిలో ఇద్దరు, 13 సంస్థల్లో ఒక్కరు చొప్పున మాత్రమే ఫండ్ మేనేజర్లు ఉన్నారు.










