
దమ్మపేట: ఎన్నికలంటే ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి.. కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' ఎన్నికలు చాలా వస్తుంటరు పోతుంటారు. మీరు ఎన్నికల్లో చాలాసార్లు పాల్గన్నారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతన్నా. ఎన్నికలు వచ్చాయంటే ఆగం కావొద్దు. నినాదంగా మంచీ చెడు ఆలోచించాలి. ఎన్నికలు వచ్చాయంటే పార్టీకి కొరు నిలబడుతరు. బీఆర్‌ఎస్ నుంచి నాగేశ్వర్‌రావు నిలబడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి వేరేవాళ్లు నిలబడతారు. అన్నింటి కన్నా ముఖ్యంగా అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నరు. ఆ పార్టీల చరిత్ర, నడవడిక, ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం ఆలోచిస్తారు.. బీదసాదల గురించి ఆ పార్టీల దఅక్పథం ఏంటీ? ఆలోచన సరళి ఏంటీ అనే విషయం గ్రామాల్లో, పట్టణాల్లో చర్చ జరగాలి' అన్నారు. 'ఆ చర్చల్లో తేల్చినంక మాత్రమే ఓటు వేసే పరిస్థితి వస్తే.. ఎన్నికల్లో నాయకులు గెల్వడం కాదు. ప్రజలు గెలవడం అనేది ప్రారంభవుతుంది. ప్రజలు గెలిస్తే మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికలు వచ్చాయంటే అబద్ధాలు, అబండాలు, అలవిగానుటువంటి వాగ్ధాలు, అవి నెరవేర్చకపోవడాలు, ప్రజల్లో అసంతఅప్తి చూస్తున్నారు. ఇదంతా పోవాలంటే నేను కోరుకున్న ప్రజాస్వామ్య పరిణితి రావాలి. మీ గ్రామాలు, బస్తీలకు వెళ్లిన తర్వాత గ్రామస్తులతో కలిసి నాలుగు అంశాలపై చర్చ జరిపి.. నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇది మూడోసారి జరుగుతున్నటువంటి ఎన్నిక. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో.. ఎన్ని ఇబ్బందులుపడ్డమో మీ కండ్ల ముందు జరిగిన చరిత్ర' అంటూ గుర్తు చేశారు. 'తెలంగాణ రాష్ట్రం మనకే ఉండే.. దాన్ని బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా. హైదరాబాద్ స్టేట్ అలాగే ఉంటే.. ఈ పాటికి మన ప్రాజెక్టులు కంప్లీట్ అయి.. చాలా ధనిక రాష్ట్రంగా మనం ఉండేవాళ్లం. మన దరిద్రమంతా తీరిపోయేది. సమైక్య రాష్ట్రంలో కలవడం వల్ల వాళ్ల దఅక్పథం ఎంత సేపు అవువైపు ఉండే తప్ప మన వైపు లేకుండే. అందువల్లనే బాధలు అనుభవించాం' అని అన్నారు.