Mar 27,2023 07:41

రాజకీయాల్ని
రాబందులకు అప్పజెప్పాక
విలువలన్నీ వెర్రి తలలుగా మారి
చిత్ర విచిత్రాలు చరిత్రపై నిలుస్తున్నాయి
అధికారం ఇంటి చుట్టమై
ఆంబోతు రంకెలు వినిపిస్తున్నాయి

ప్రశ్నించడం ఇప్పుడొక దేశ ద్రోహం
నిలదీయడం రాజద్రోహం
అధికారం కోసం అదును చూసి
మాటువేసి కొట్టడం నేటి ట్రెండ్‌ సెట్‌ రాజకీయం
చీకటి నిండిన రాజ్యంలో
గబ్బిలాలదే పెత్తనం అవుతుంది
అవినీతి నిండిన దేశంలో
ప్రశ్నించి, నినదించి నిలదీసే పులులూ ఉంటాయి

మీరు బెదిరిస్తే బెదిరే మీ బినామీలం కాదు
అల్లూరి వారసులం
అవినీతిపై ఎదురొడ్డి నిలిచే
భరతమాత పుత్రులం

మీ రాజకీయ దారికి అడ్డంటూ
అనర్హత వేటు కత్తిలా వేలాడితే
ఒక్క రాహుల్‌ గుండె వేల వేల గొంతులై
మీ భరతం పట్టి మీ రాజకీయ భవితను
భూస్థాపితం చేస్తాయి...!

- మహబూబ్‌ బాషా చిల్లెం
mehaboobbashachillem@gmail.com