శోభకత్ ఉగాది సందర్భంగా తెలంగాణ భాషా సాంస్క ృతిక శాఖ, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక కృష్ణవేణి టాలెంట్ స్కూలు సంయుక్త ఆధ్వర్యంలో కె.హరనాథ్ గారి 'ఊహలకే ఊపిరొస్తే' కవితా సంపుటిని ఎమ్మెల్సీ సురభిదేవి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి సమావేశమందిరం మొదటి అంతస్తులో 31.3.2023 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. వేమిరెడ్డి నరసింహారెడ్డి, జూలూరి గౌరీశంకర్, డా. కారుకాల అనితారెడ్డి, మామిడి హరికృష్ణ, పులిపాక సత్యమూర్తి, ఎ. కామేశ్వరరావు, ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొంటారు. అనంతరం అభినందన సత్కారం, కవి సమ్మేళనం ఉంటాయి.
- కె.హరనాథ్, కన్వీనర్
హైదరాబాద్ పాత నగర కవుల వేదిక










