
సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు డా. దేవరాజు మహారాజు గారిది. వారి 'సప్తతి' వేడుక మానవ వికాస వేదిక నిర్వహిస్తుంది. ఆగస్టు 15, 2023 మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం కొండాపూర్‌లోని సి.ఆర్. ఫౌండేషన్‌లో జరగనుంది. మేధావులు వద్ధాప్యంలో సేద తీరే గొప్ప కేంద్రమది. అక్కడ ఉండే పెద్దలు నగరంలోని వివిధ కార్యక్రమాలకు హాజరుకాలేక పోవచ్చు కనుక, అక్కడే, వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాం. తద్వారా సీనియర్ సిటిజెన్లను గౌరవించినట్లు అవుతుందని భావిస్తున్నాం. జతపరిచిన ఆహ్వాన పత్రంలో వివరాలు ఉన్నాయి. మీరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.
- మానవ వికాస వేదిక