ప్రముఖ కవి డా. ఎన్. గోపి రచించిన కవితాసంపుటి 'క్రియ ఒక జీవన లయ' ఆవిష్కరణ జూన్ 25 ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని రవీంద్ర భారతి సమావేశ మందిరం (మొదటి అంతస్తు)లో జరుగుతుంది. సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్ర మూర్తి ఆవిష్కరిస్తారు. డా. వోలేటి పార్వతీశం అధ్యక్షత వహిస్తారు. కిల్లాడ సత్యనారాయణ కృతిని స్వీకరిస్తారు. డా. మామిడి హరికృష్ణ, వంగల హర్షవర్ధన్, డా. ఎస్. రఘు, కుడికాల వంశీధర్ పాల్గొంటారు.










