
ఛాంగ్వాన్(ద.కొరియా): భారత స్టార్ షూటర్ అనీశ్ భన్వాలా 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్స్ షూటింగ్ పోటీల పురుషుల 25మీ. పిస్టల్ ఫైర్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించి అనీశ్ ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన 21ఏళ్ల అనీశ్.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 12వ షూటర్. ఇక 25మీ. పిస్టల్ ఫైర్ ఈవెంట్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించిన తొలి ప్లేయర్ కూడాను. ఇక జపాన్‌కు చెందిన దోరు యోషికోకు రజతం, కొరియాకు చెందిన లీ గున్‌యోక్‌కు స్వర్ణ పతకం దక్కాయి. 28షాట్ల ఫైనల్లో అనీశ్ 588పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.