Feb 18,2023 21:30

చెన్నయ్ : ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కొత్తగా నాలుగు చక్రాల విద్యుత్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. 2024 కల్లా ఇవి కార్లను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో 20గిగావాట్‌ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని, కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు తెలిపింది. రూ.7,614 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొంది. ఈ వ్యయంతో బ్యాటరీల తయారీ సహా ఇవి కార్లను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా 3111 ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.