Oct 26,2023 21:10

బెంగళూరు : ప్రముఖ ద్విచక్ర విద్యుత్‌ వాహనాల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ రూ.3,000 కోట్ల నిధులు సమీకరించినట్లు గురువారం వెల్లడించింది. టెమాసెక్‌ నేతృత్వంలోని ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) నుంచి ఈ మొత్తాన్ని అందుకోనున్నట్లు వెల్లడించింది. నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొంది. ఈ నిధులను వ్యాపార విస్తరణకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. అదే విధంగా తమిళనాడులోని కృష్ణగిరిలో లిథియం ఐయాన్‌ సెల్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని వెల్లడించింది. భవిష్యత్తులో ఈ సంస్థ ఇవి సైకిళ్లు, కార్లు విభాగంలోకి ప్రవేశించనుంది.