Oct 07,2023 21:08

బెంగళూరు : క్యాబ్‌ అగ్రిగేటర్‌ సేవలనందించే ఓలా కొత్తగా పార్సిల్‌ డెలివరీ సేవల్లోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. ఓలా పార్సిల్‌ పేరిట ఇకపై డెలివరీ సేవలను కూడా అందించనున్నామని పేర్కొంది. ఈ సేవలను తొలుత బెంగళూరులో ప్రారంభించినట్లు తెలిపింది. ఇందుకోసం ఓలా ఇవి స్కూటర్లను మాత్రమే ఉపయోగిస్తామని ఓలా ఫౌండర్‌ భవీష్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25, 15 కిలోమీటర్ల దూరానికి రూ.75, 20 కిలోమీటర్ల దూరానికి రూ.100 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నామన్నారు.