
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణలు కలిసి మంగళవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, శాసన సభ్యులు బడు కొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ రఘు రాజులు ఉన్నారు.