
విజయనగరం కోట : పైడితల్లి పండగ నేపథ్యంలో వేలాది మందితో కళకళలాడాల్సిన విజయనగరం జనం లేక వెలవెల బోయింది. కరోనా కట్టడికి అధికారులు తీసుకున్న చర్యలు ఫలించాయి. ప్రజలెవరూ జాతరకు రాకుండా ఉండేందుకు లాక్‌డౌన్ విధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, చెక్‌పోస్టులు పెట్టారు. దీంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. షాపులు మూతపడ్డాయి. 144 సెక్షన్ విధించడంతో పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. బస్సులు తిరగకపోవడంతో ఆర్‌టిసి కాంప్లెక్సు వెలవెలబోయింది. డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు బస్సులు లేక ఇబ్బంది పడ్డారు.