ఇదో నూతన ప్రతిఘటనా సంకేతం
అమెరికోన్ని మూడు చెరువుల
నీళ్ళు తాగించిన వియత్నాం వారసత్వం
చిట్టెలుకలన్నీ కూడబలుక్కుని
పిల్లిని కాదు పులిపై ఒక్కసారిగా
విరుచుకుపడి బెంబేలెత్తించిన
ప్రతిఘటనా పోరాటం!
అగ్ర రాజ్యాల అండతో
తమకో దేశమంటూ లేకుండా చేసి
వేలాదిమందిని ఊచకోత కోసి
నిత్యమూ భయంతో తెల్లారే
తమ బతుకు నుండి
పెట్టిన రాకెట్ల పొలికేక !
వాడు గొప్పగా చెప్పుకునే
ఇనుప తెరను చీల్చి
నగరం నడిబొడ్డుపై నడయాడిన
నెలవంకల నెత్తుటి పాదాలు
వాడు ప్రపంచానికి చూపే
అబద్ధపు సాక్ష్యాలను
మోసే మీడియాకు
వాళ్ళొట్టి ఉగ్రవాదులే !
కానీ, తమ నెత్తుటి బాకీ
తీర్చుకునే వాళ్ళు
బలహీనులకు ఓ భరోసా కదా?
(ఇజ్రాయిల్‌పై హమాస్ ప్రతిఘటనకు స్పందనగా)
- కెక్యూబ్ వర్మ
94934 36277