Mar 31,2023 21:24

న్యూఢిల్లీ : రంజాన్‌ పండుగ సందర్బంగా ఆజ్మీర్‌లో ఉచిత వసతి అందిస్తున్నట్లు ఓయో హౌటల్స్‌ తెలిపింది. ఆక్కడి హౌటల్‌ వైభవ్‌, హౌటల్‌ జెసి ప్యాలెస్‌లో ఉచిత సౌకర్యాలు పొందవచ్చని పేర్కొంది. ఇవి నయా బజార్‌ దర్గాకు అతి సమీపంలో ఉన్నాయని తెలిపింది. తమ యాప్‌ ద్వారా, వెబ్‌సైట్‌ను సంప్రదించి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.