Aug 17,2023 21:24

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్‌జిసి) ఈ దశాబ్దం ముగింపు నాటికి తక్కువ కార్బన్‌ ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో పునరుత్పాదన ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌ విభాగాలపై దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. కార్బన్‌ తగ్గించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయాలని నిర్దేశించుకున్నట్లు వెల్లడించింది. దేశంలో రెండు గ్రీన్‌ ఫీల్డ్‌ ఒ2సి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కానీ ఆ వివరాలను వెల్లడించలేదు. పునరుత్పాదన ఇంధన రంగంలో 10గిగావాట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.