Nov 15,2023 21:16

రెండు పెట్రో కెమికల్‌ ప్లాంట్ల ఏర్పాటు
న్యూఢిల్లీ : దిగ్గజ చమురు రంగ కంపెనీ ఒఎన్‌జిసి రెండు పెట్రో కెమికల్‌ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఇవి ముడి చమురు నుంచి ప్రత్యక్షంగా అధిక విలువ కలిగిన రసాయనాల ఉత్పత్తులు తయారు కానున్నాయని ఆయిల్‌ అండ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్‌జిసి) డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) పొమిల జాస్పల్‌ తెలిపారు. ఈ ఆయిల్‌ టు కెమికల్‌ (ఒ2సి) ప్లాంట్లలో పెట్రోల్‌, డీజిల్‌, జెట్‌ ఫ్యూయల్‌ ఉత్పత్తి కానుందన్నారు. అదే విధంగా డిటర్జెంట్లు, పాలిస్టర్‌, నైలాన్‌, అర్కిలిక్‌ తదితర ఉత్పత్తులకు కావాల్సిన రసాయనాలు ప్రాసెస్‌ కానున్నాయని ఆమె తెలిపారు. అయితే ఈ యూనిట్‌లను ఎక్కడ నెలకొల్పేది ఆమె వెల్లడించారు.