న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ 4కెతో ఒఎల్‌ఇడి టివిలను విడుదల చేసినట్లు తెలిపింది. వీటిని భారత్‌లోనే తయారు చేసినట్లు పేర్కొంది. ఒఎల్‌ఇడిలో ఎస్95సి, ఎస్90సి సిరీస్‌లను విడుదల చేసినట్లు వెల్లడించింది. వీటిలో 77, 65, 55 అంగుళాలలో మూడు పరిమాణాలలో రూ.169,990 ధర నుంచి ప్రారంభమవుతాయని ఆ కంపెనీ తెలిపింది. రెండేళ్ల వారంటీతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. వినియోగదారులు ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై గరిష్టంగా 20 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని, అదే విధంగా రూ.2,990 నుంచి ప్రారంభమయ్యే ఇఎంఐలను ఎంచుకోవచ్చని తెలిపింది.










