
ఇంగ్లండ్ × న్యూజిలాండ్ మ్యాచ్‌లో ప్రారంభం
అహ్మదాబాద్: ఐసిసి వన్డే ప్రపంచకప్ సంగ్రామం రేపటినుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభానికి ముందు జరిపే వేడుకలను ఈసారి నిర్వహించడం లేదని భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) వెల్లడించింది. దీంతో గత వన్డే ప్రపంచకప్ ఫైనలిస్ట్ జట్లయిన ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇక బుధవారం రాత్రి సంప్రదాయబద్ధంగా కెప్టెన్స్ డే ఈవెంట్‌ను నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ క్లబ్ హౌస్‌కు చెందిన బాంక్వెట్ హాల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 10జట్ల కెప్టెన్లు పాల్గన్నారు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పాల్గన్నారు. గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. అహ్మాదాబాద్ వేదికగా ఆ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ జట్టు దుర్భేధ్యఫామ్‌లో ఉండగా.. న్యూజిలాండ్ జట్టు గాయాలతో సతమతమౌతోంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇద్దరూ ప్రస్తుతం గాయాలతో ఇబ్బందిపడుతున్నారు. 2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు మాత్రం మేటి బ్యాటర్లతో బలంగా కనిపిస్తోంది. బెన్ స్టోక్స్‌తో పాటు జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, జో రూట్, డేవిడ్ మలన్, హ్యారీ బ్రూక్ లాంటి హార్డ్ హిట్టర్లతో ఆ జట్టు బలీయంగా ఉంది. ఐపిఎల్‌లో ఆడిన అనుభవం వారికి అనుకూలించే అవకాశాలున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనలో ఇంగ్లండ్ బౌండరీల ఆధారంగా ట్రోఫీని తొలిసారి ముద్దాడింది.
- ఐసిసి వన్డే ప్రపంచకప్ షెడ్యూల్..
5(గురు) ఇంగ్లండ్ × న్యూజిలాండ్ అహ్మదాబాద్ మ.2.00గం||
6(శుక్ర) పాకిస్తాన్ × నెదర్లాండ్స్ హైదరాబాద్ మ.2.00గం||
7(శని) బంగ్లాదేశ్ × ఆఫ్ఘనిస్తాన్ ధర్మశాల ఉ.10.30గం||
దక్షిణాఫ్రికా × శ్రీలంక ఢిల్లీ మ.2.00గం||
8(ఆది) ఇండియా × ఆస్ట్రేలియా చెన్నై మ.2.00గం||
9(సోమ) న్యూజిలాండ్ × నెదర్లాండ్స్ హైదరాబాద్ మ.2.00గం||
10(మంగళ) ఇంగ్లండ్ × బంగ్లాదేశ్ ధర్మశాలల ఉ.10.30గం||
పాకిస్తాన్ × శ్రీలంక హైదరాబాద్ మ.2.00గం||
11(బుధ) ఇండియా × ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ మ.2.00గం||
12(గురు) ఆస్ట్రేలియా × దక్షిణాఫ్రికా లక్నో మ.2.00గం||
13(శుక్ర) న్యూజిలాండ్ × బంగ్లాదేశ్ చెన్నై మ.2.00గం||
14(శని) ఇండియా × పాకిస్తాన్ అహ్మదాబాద్ మ.2.00గం||
15(ఆది) ఇంగ్లండ్ × ఆఫ్ఘనిస్తాన్ ఢిల్లీ మ.2.00గం||
16(సోమ) ఆస్ట్రేలియా × శ్రీలంక లక్నో మ.2.00గం||
17(మంగళ) దక్షిణాఫ్రికా × నెదర్లాండ్స్ ధర్మశాల మ.2.00గం||
18(బుధ) న్యూజిలాండ్ × ఆఫ్ఘనిస్తాన్ చెన్నై మ.2.00గం||
19(గురు) ఇండియా × బంగ్లాదేశ్ పూణే మ.2.00గం||
20(శుక్ర) ఆస్ట్రేలియా × పాకిస్తాన్ బెంగళూరు మ.2.00గం||
21(శని) నెదర్లాండ్ × శ్రీలంక లక్నో ఉ.10.30గం||
ఇంగ్లండ్ × దక్షిణాఫ్రికా ముంబయి మ.2.00గం||
22(ఆది) ఇండియా × న్యూజిలాండ్ ధర్మశాల మ.2.00గం||
23(సోమ) పాకిస్తాన్ × ఆఫ్ఘనిస్తాన్ చెన్నై మ.2.00గం||
24(మంగళ) దక్షిణాఫ్రికా × బంగ్లాదేశ్ ముంబయి మ.2.00గం||
25(బుధ) ఆస్ట్రేలియా × నెదర్లాండ్స్ ఢిల్లీ మ.2.00గం||
26(గురు) ఇంగ్లండ్ × ఆస్ట్రేలియా బెంగళూరు మ.2.00గం||
27(శుక్ర) పాకిస్తాన్ × దక్షిణాఫ్రికా చెన్నై మ.2.00గం||
28(శని) ఆస్ట్రేలియా × న్యూజిలాండ్ ధర్మశాల ఉ.10.30గం||
నెదర్లాండ్స్ × బంగ్లాదేశ్ కోల్‌కతా మ.2.00గం||
29(ఆది) ఇండియా × ఇంగ్లండ్) లక్నో మ.2.00గం||
30(సోమ) ఆఫ్ఘనిస్తాన్ × శ్రీలంక పూణే మ.2.00గం||
31(మంగళ) పాకిస్తాన్ × బంగ్లాదేశ్ కోల్‌కతా మ.2.00గం||
నవంబర్‌ా1(బుధ) న్యూజిలాండ్ × దక్షిణాఫ్రికా పూణే మ.2.00గం||
2(గురు) ఇండియా × శ్రీలంక ముంబయి మ.2.00గం||
3(శుక్ర) నెదర్లాండ్స్ × ఆఫ్ఘనిస్తాన్ లక్నో మ.2.00గం||
4(శని) న్యూజిలాండ్ × పాకిస్తాన్ బెంగళూరు ఉ.10.30గం||
ఇంగ్లండ్ × ఆస్ట్రేలియా అహ్మదాబాద్ మ.2.00గం||
5(ఆది) ఇండియా × దక్షిణాఫ్రికా కోల్‌కతా మ.2.00గం||
6(సోమ) బెంగళూరు × శ్రీలంక ఢిల్లీ మ.2.00గం||
7(మంగళ) ఆస్ట్రేలియా × ఆఫ్ఘనిస్తాన్ ముంబయి మ.2.00గం||
8(బుధ) ఇంగ్లండ్ × నెదర్లాండ్స్ పూణే మ.2.00గం||
9(గురు) న్యూజిలాండ్ × శ్రీలంక బెంగళూరు మ.2.00గం||
10(శుక్ర) దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్తాన్ అహ్మదాబాద్ మ.2.00గం||
11(శని) ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్ పూణే ఉ.10.30గం||
ఇంగ్లండ్ × పాకిస్తాన్ కోల్‌కతా మ.2.00గం||
12(ఆది) ఇండియా × నెదర్లాండ్స్ బెంగళూరు మ.2.00గం||
16(బుధ) సెమీఫైనల్-1 (1 × 4) ముంబయి మ.2.00గం||
17(గురు) సెమీఫైనల్-2 (2 × 3) కోల్‌కతా మ.2.00గం||
19(ఆది) ఫైనల్ అహ్మదాబాద్ మ.2.00గం||